నవతెలంగాణ – తుంగతుర్తి
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా తుంగతుర్తి నియోజకవర్గాన్ని, ఆరు మండలాలకు అనుకూలంగా ఉండే విధంగా రెవెన్యూ డివిజన్ చేస్తేనే నియోజకవర్గ కేంద్రం అభివృద్ధి చెందుతుందని స్థానిక సర్పంచ్ మల్లెపాక సాయిబాబా అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. తుంగతుర్తి నియోజకవర్గం విస్తీర్ణం పరంగా విశాలంగా ఉండటంతో పాటు జనాభాపరంగా కూడా పెద్ద నియోజకవర్గాలలో ఒకటిగా ఉందన్నారు. గత 10 సంవత్సరాలుగా తుంగతుర్తిని రెవెన్యూ డివిజన్ గా చేయాలన్న డిమాండ్ పై ప్రజలు, ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాలు అనేక ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. ప్రజల భావోద్వేగం, పరిపాలన సౌకర్యార్థం దృష్ట్యా తుంగతుర్తి నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని కోరారు.
తుంగతుర్తిని రెవిన్యూ డివిజన్ చేయాలి: సర్పంచ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



