Saturday, January 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హామీల అమలే నా లక్ష్యం: సర్పంచ్ కుంచాల

హామీల అమలే నా లక్ష్యం: సర్పంచ్ కుంచాల

- Advertisement -

నవతెలంగాణ – తుంగతుర్తి
బిల్లులతో నాకేంటి.. హామీల అమలే నా లక్ష్యం అంటూ.. ముందుకు సాగుతూ.. గ్రామ ప్రజల మన్ననలను సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి పొందుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు, తన తండ్రి కుంచాల వెంకట్రాంరెడ్డి జ్ఞాపకార్థం శుక్రవారం గ్రామ పంచాయతీకి ఫ్రీజర్ ను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలోని పేద, మధ్యతరగతి ప్రజల సౌకర్యార్థం, మరణించిన వారి భౌతిక కాయాలను భద్రపరచడానికి సామాజిక స్పృహతో స్వచ్ఛందంగా ఫ్రీజర్‌ను వితరణ చేయడం జరిగిందన్నారు.

సామాజిక సేవలో భాగంగా ప్రజలకు ఆర్థిక భారాన్ని తగ్గించడం కోసం ఫ్రీజర్ను అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వెలిశాల సరిత, వార్డు మెంబర్లు కడారి సుకన్య, బింగి వెంకటేశ్వర్లు, బల్లెం ప్రవీణ్, పార్టీ సీనియర్ నాయకులు దొంగరి శ్రీనివాస్, చిత్తలూరి సోమశేఖర్, ఏటెర్గు శ్రీనివాస్ రెడ్డి, తన్నీరు యాదగిరి, కడారి దాసు, బోర నరేష్, పంచాయతీ కార్యదర్శి రమేష్, పల్లె డాక్టర్ బైన రమ్య, ఏఎన్ఎం రజిత గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -