Sunday, January 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పాఠశాలల్లో ముగ్గుల పోటీలు నిర్వహించిన ఉపాధ్యాయులు

పాఠశాలల్లో ముగ్గుల పోటీలు నిర్వహించిన ఉపాధ్యాయులు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని పలు గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముందస్తుగా సెలవులు ఉండడంతో విద్యార్థిని విద్యార్థులు నిర్వహించారు. ఈ సందర్భంగా పడంపల్లి గ్రామంలోని ఎంపియుపిఎస్  హెచ్ఎం జగదీష్ , బస్వాపూర్ లోని ఎంపియుపిఎస్ ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం జై చంద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలో విద్యార్థినిలు ఉత్సాహంగా పాల్గొన్నారు. రంగురంగుల ముగ్గులను విద్యార్థినిలు రంగవల్లి వేయడంతో పాఠశాలలకి అందం బాటిల్లింది.

ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులు పోటీలను గెలుపొందిన వారికి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు అందించి జ్ఞాపికలను అందించడం జరిగింది. ఈ ముగ్గుల పోటీల కార్యక్రమంలో పడంపల్లి గ్రామ సర్పంచ్ విజయ కుమారి సంజీవ్, ఉపసర్పంచ్ పావుడే సవిత, ఎంపియుపిఎస్ హెచ్ఎం జగదీష్ తో పాటు ఉపాధ్యాయులు ఉమాకాంత్, శ్రీనివాస్ , బస్వా పూర్ సర్పంచ్ వాగ్మరే రమణ ,ఎంపీ యుపిఎస్ పాఠశాల హెచ్ఎం జై చంద్ తో పాటు ఉపాధ్యాయ బృందం గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -