- Advertisement -
నవతెలంగాణ – ముధోల్
అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయిస్తామని మచ్కల్ సర్పంచ్ ఆత్మస్వరుప్ అన్నారు. ముధోల్ మండలంలోని మచ్కల్ గ్రామంలో శుక్రవారం మండల పంచాయతీ అధికారి చంద్రశేఖర్ తో కలిసి ఇందిరమ్మ ఇళ్లు కు భూమి పూజ చేశారు. ఆనంతరం ఆయన మాట్లాడారు. గ్రామంలో మొదటి దశలో 25 ఇండ్లు మంజూరు అయ్యాయన్నారు. రెండు దశలో త్వరలో మరో 20 ఇండ్లు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సహకారం తో మంజూరు చేయిస్తామని చెప్పారు. గ్రామంలో ఇండ్లు లేనివారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గంగాధర్, గ్రామస్థులు పాల్గొన్నారు.
- Advertisement -



