ఎస్ జి టి ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు పులిజాల సందీప్ సందీప్
నవతెలంగాణ – మిడ్జిల్
ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని, ప్రభుత్వ విద్యకు నష్టం కలిగించే జాతీయ విద్యా విధానం వెంటనే రద్దు చేయాలని ఎస్ జి టి ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు పులిజాల సందీప్ అన్నారు. ఉపాధ్యాయ సమస్యల కోసం జాక్టో ఇచ్చిన పిలుపుమేరకు శుక్రవారం మండలంలోని మల్లాపూర్ , కొత్తూర్, గ్రామాలలోని పాఠశాలలో భోజన విరమణ సమయంలో నల్లబ్యార్జీలతో ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సుప్రీంకోర్టు తీర్పు వచ్చి నాలుగు నెలలు గడిచిన కేంద్ర ప్రభుత్వంగానే, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి కానీ ఏమాత్రం స్పందించకుండా మౌనంగా ఉండడానికి ఉపాధ్యాయ సంఘం తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు.
2010 కంటే ముందు నియమించిన ఉపాధ్యాయులకు అర్వత పరీక్ష నియం మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండు సంవత్సరాలలో టెట్ పాస్ కాకపోతే లక్షలాదిమంది ఉపాధ్యాయులు ఉద్యోగం కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల కోసం ఫిబ్రవరి 5 వ తేదీన ఉపాధ్యాయులు ఢిల్లీ వెళ్లి పార్లమెంటు ఎదుట నిరసన ప్రదర్శనలో ఉపాధ్యాయులందరూ పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామా పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.



