- Advertisement -
- సంస్కృతికి చిహ్నం పండగలే..
- బసవన్నల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణ
- నవతెలంగాణ- కుభీర్
కుబీర్ మండలంలోని విద్యా భారతి పాఠశాలలో శుక్రవారం విద్యార్థులంతా కలిసి సంక్రాంతి సంబరాలతో మునిగితేలారు. నాటి సంస్కృతి సాంప్రదాయాలు ఆ తరానికి కాకుండా నేటి తరానికి తెలియజేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ పురంశెట్టి లింగయ్య మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలలో పెద్ద పండుగ సంక్రాంతి, ఈ పండుగ తమ చిన్నారులంత, విభిన్న వేషధారణలో ముద్దులొలుకుతూ సందడి చేశారన్నారు. - చిన్నారులకు భోగి వేడుక, బొమ్మల కొలువులు, గొబ్బెమ్మలు, ముగ్గుల పోటీలు రకరకాల పిండి వంటల ప్రదర్శన, భోగి మండలు బసవన్నల విన్యాసాలు, హరిదాసుల గానములతో అచ్చమైన తెలుగు రాష్ట్రాల సాంప్రదాయాలతో అలరించారు. మనది వ్యవసాయ ఆధారిత దేశం పంటలు చేతికందే సమయానికి వచ్చే పండుగ సంక్రాంతి అప్పుడు రైతులు పంట అమ్ముకునే సంతోషంగా ఉంటారు.
- అందుకే ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారన్నారు. అనంతరం గాలి పతంగులను ఎగురవేయడం లోను ఆడిపడి ఎంతో ఉత్సవంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ పురంశెట్టి లింగయ్య , ప్రిన్సిపల్ పోతన్న, కరస్పాండెంట్ గంగా సింగ్, కొట్టే రాజు, సాయినాథ్, భోజన్న, కొట్టే ప్రవీణ్,దేవకి, సరస్వతి, కవిత, రాణి, నేహ, అంజలి, శ్రీవిద్య, గంగామణి, సరోజన, శృతిక, పద్మ, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -



