జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జ్ వి రజిని
నవతెలంగాణ – వనపర్తి
యువకులకు వివేకానంద స్వామి జీవితం ఆదర్శం అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి రజని అన్నారు. శుక్రవారం వనపర్తి జిల్లా నర్సింగాయపల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నేషనల్ యూత్ డే, హ్యూమన్ ట్రాఫికింగ్ డే సందర్భంగా యువత అందరూ స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
అలాగే మత్తు పదార్థాలు, అక్రమ రవాణా బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి మాట్లాడుతూ యువకులు మాదకద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా ఉన్నత లక్ష్యాలను సాధించాలని కోరారు. ఉద్యోగాలు పొందడం కోసం మోసపూరితమైన సంస్థల వలలో చిక్కి విదేశాలలో బానిసలుగా మారవద్దని సూచించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు డ్రగ్స్ నిర్మూలనపై ఉపన్యాస పోటీలను, వ్యాసరచన పోటీలను నిర్వహించి బహుమతులను ప్రధానం చేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రఘు, కళాశాల ప్రధానోపాధ్యాయురాలు ఉమాదేవి పాల్గొన్నారు.



