Sunday, January 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్12 తుది ఓటర్ జాబితా ప్రచురించాలి : కలెక్టర్ 

12 తుది ఓటర్ జాబితా ప్రచురించాలి : కలెక్టర్ 

- Advertisement -

నవతెలంగాణ – వనపర్తి  
జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఓటర్ జాబితాపై వచ్చిన అభ్యంతరాల్ని పరిష్కరించి ఈ నెల 12 వ తేదీన వార్డు వారీగా తుది ఓటర్ జాబితా ప్రచురించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ మునిసిపల్ ఎన్నికల కార్యాచరణ సంసిద్దత గురించి మునిసిపల్ కమీషనర్లు, తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో ఓటర్ జాబితాపై వచ్చిన అభ్యంతరాల్ని పరిష్కరించి ఈ నెల 12 వ తేదీన వార్డు వారీగా ఫోటోలతో కూడిన తుది ఓటర్ జాబితా ప్రచురించాలని ఆదేశించారు. అదేవిధంగా ఈనెల 16వ తేదీన పోలింగ్ కేంద్రం వారీగా తుది ఓటర్ జాబితా ప్రదర్శించాలని సూచించారు.

ఓటర్ల వార్డు మ్యాపింగ్ సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే సరిచేయాలని మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంత ఓటర్లు ఎవరైనా ఓటర్ జాబితాలో నమోదయి ఉంటే వారిని అన్ మ్యాప్ చేయాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో అధికారులు అత్యంత పారదర్శకంగా పనిచేయాలని సూచించారు. ఆయా మున్సిపాలిటీలకు సంబంధించి పోలింగ్ కేంద్రాలను గుర్తించి అన్ని సౌకర్యాలు కల్పించేలా సిద్ధం చేయాలన్నారు. అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసెప్షన్ సెంటర్, కౌంటింగ్ కేంద్రాలకు సంబంధించి కావలసిన ప్రాంతాలను, భవనాలను గుర్తించి సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఆయా కేంద్రాల్లో సకల సౌకర్యాలు ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.

పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ప్రతి ఒక్క కేంద్రం గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉండే విధంగా చూసుకోవాలన్నారు. ఈ విధంగా మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసి సంసిద్ధంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖిమ్యా నాయక్, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, తహసిల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -