– ఐటిఐ ప్రిన్సిపల్ కోటిరెడ్డి
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని ప్రభుత్వ ఐటిఐలో (బషీరాబాద్) ఈ నెల 12న ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళ నిర్వహిస్తున్నట్లు ఐటిఐ ప్రిన్సిపల్ కోటిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో ఐటిఐ పాసైన విద్యార్థులు ఉదయం 10 గంటలకు ఈ అప్రెంటిస్ మేళాకు హాజరుకావాలని ఆయన సూచించారు. ఈ మేళాలో హైదరాబాదుకు చెందిన వరుణ్ మోటార్స్ కంపెనీ, నిజామాబాద్ జిల్లాకు చెందిన సుబ్జిత్ స్టార్స్ మిల్స్ కంపెనీ, హైదరాబాద్ కు చెందిన ప్రీమియర్ ఎనేర్గిస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, నిజాంబాద్ జిల్లాలోని సారంగాపూర్ కు చెందిన ఎవరెస్ట్ స్కిల్స్ కంపెనీ వారు పాల్గొంటారని తెలిపారు.
అప్రెంటిస్ మేళాకు హాజరైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి తమ కంపెనీలకు అవసరమైన వారిని ఎంపిక చేసుకుంటారని ప్రిన్సిపాల్ కోటిరెడ్డి తెలిపారు. వివిధ ఐటిఐ ట్రేడ్స్ లలో పాసైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా ఎక్సెలర్ ప్రైవేట్ కంపెనీ వారు ఐటిఐ పాస్ అయిన విద్యార్థులకు ట్రైనింగ్, ప్లేస్ మెంట్ ను పూణేలోని టాటా మోటార్స్ లో ఇస్తారన్నారు. అక్కడ ఉచిత వసతి, భోజనం సదుపాయం, స్టైఫండ్ ఇవ్వడంతో పాటు ట్రైనింగ్ అయిన వారికి డిప్లమా సర్టిఫికెట్ అందజేస్తారని తెలిపారు. ఇట్టి అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఇతర వివరాలకు 9491566890, 8106794500 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.



