Sunday, January 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హాస కొత్తూర్ పాఠశాలకు సైన్స్ మెటీరియల్ వితరణ

హాస కొత్తూర్ పాఠశాలకు సైన్స్ మెటీరియల్ వితరణ

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని హాస కొత్తూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ప్రముఖ పారిశ్రామికవేత్త ఏనుగు దయానంద్ రెడ్డి  సైన్స్ మెటీరియల్ ను వితరణ చేశారు. ఈ మేరకు శుక్రవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నలిమెల రేవతి గంగాధర్, ఉప సర్పంచ్ మనోహర్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సతీష్ చేతుల మీదుగా సైన్స్ మెటీరియల్ ను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అరుణ శ్రీ కి అందచేశారు.రూ.80వేల విలువ చేసే రెండు ప్రయోగ టేబల్స్ తో పాటు సైన్స్ సామాగ్రిని దయానంద్ రెడ్డి అందచేసినట్టు ప్రధానోపాధ్యాయురాలు అరుణ శ్రీ తెలిపారు.

గతంలో కూడ ఆట సామాగ్రితో పాటు పిల్లలు కూచోవడానికి వీలుగా ఇరవై డెస్క్ బెంచ్ లు పాఠశాలకు అందించారని ఆమె తెలిపారు.  పాఠశాలకు చేయూతను అందిస్తున్న దయానంద్ రెడ్డికి పాఠశాల విద్యార్థుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. పారిశ్రామికవేత్త దయానంద్ రెడ్డి పాఠశాలకు విరాళం అందించడంలో సహకరిస్తున్న పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ రాజ్ కుమార్ లను సర్పంచ్ రేవతి గంగాధర్ తో పాటు అతిథులు అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ  సభ్యులు, ఉపాధ్యాయులు కృష్ణ కుమార్, నరేందర్, మాధురి, ఆనందం, జాన్ షేక్ రాంపాల్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -