-క్వార్టర్ పై రూ.40,బీరుపై రూ.40 అదనం
-చోద్యం చూస్తున్న ఎక్సైజ్ శాఖ
నవతెలంగాణ – కాటారం:
మండల కేంద్రంలో ఎక్సైజ్ శాఖ అధికారులు ఉన్నప్పటికీ వారు కళ్ళు మూసుకోవడంతో మండల కేంద్రంతో పాటు చుట్టు పక్కల గ్రామాలలో వీధికో రెండు, మూడు బెల్టు షాపులు దర్శనమిస్తున్నాయి. ఎక్సైజ్ శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో పచ్చని పల్లెల్లో మద్యం ఏరులై పారుతుంది. బ్రాందీ షాప్ లో కింగ్ ఫిషర్ లైట్ బీరు 180 రూపాయలు ఉండగా బెల్ట్ షాపుల్లో 220 రూపాయలకు అంటే రూ.40 రూపాయలు అదనంగా అమ్ముతున్నారు. రాయల్ స్టాక్ క్వాటర్ రూ.220 ఉండగా బెల్టు షాపులో మాత్రం రూ.260 అంటే రూ.40 అమ్ముతున్నారు. ఇలా ప్రతి బ్రాండ్ మీద ఒక్కో బాటల్ కు 40 రూపాయలు చొప్పున అదనంగా అమ్ముతూ మందుబాబుల జేబుకు చిల్లులు వేస్తున్నారు. ఇదంతా ఎక్సైజ్ శాఖ అధికారుల కనుసైగల్లోనే జరుగుతున్నప్పటికీ పట్టించుకోవలసిన అధికారులే కళ్ళు మూసుకొని ఉండడంతో అడిగే వారే లేకుండా పోతున్నారు. దళారులు సిండికేట్ దందాలో ఆరితేరి పోయారు. బ్రాందీ షాపులో దొరకని బ్రాండ్ బెల్ట్ షాపుల్లో యదేచ్చగా అమ్ముతున్నారంటే సిండికేట్ దందా మూడు బీర్లు, ఆరు క్వార్టర్లుగా ఎంతలా విరజిల్లుతుందో చెప్పనక్కరలేదు. ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ ఉన్నత అధికారులు స్పందించి అధిక రేట్లకు విక్రయిస్తున్న బెల్టు షాపులపై కొరడా జులిపించాలని, వారికి ఆద్యం పోస్తున్న బ్రాండీ షాపులపై చర్యలు తీసుకోవాలని, సామాన్యులకు అందుబాటులో అన్ని బ్రాండ్లు అందేలా చూడాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు
బ్రాందీ షాపుల్లో నిల్లు, బెల్టు షాపుల్లో ఫుల్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



