హీరో శర్వా, దర్శకుడు రామ్ అబ్బరాజు కలయికలో రూపొందిన చిత్రం ‘నారి నారి నడుమ మురారి’. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై. లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య కథనాయికలుగా నటిస్తున్నారు. ఈనెల 14న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ రామ్ అబ్బరాజు మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
-ఇది పండగ లాంటి సినిమానే. మంచి యూత్‌ఫుల్ ఫన్ ఉన్న ఎంటర్టైన్మెంట్ ఇది. చిన్నప్పటి నుంచి సంక్రాంతికి ఎన్నో సినిమాలు చూస్తూ పెరిగా. ఇప్పుడు డైరెక్టర్‌గా ఫస్ట్ టైం సంక్రాంతికి నా సినిమా రావడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తోంది.
-క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్‌తో ఆడియన్స్‌ని అలరించడం ఇష్టం. నేను తీసిన ‘వివాహ భోజనంబు, సామజవరగమన’, ఇప్పుడు ఈ సినిమా కూడా చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందరూ కలిసి హాయిగా చూసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది.
-ఇద్దరమ్మాయిలు, ఒక అబ్బాయి అంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని ఫీలింగ్ వస్తుంది. కానీ ఇందులో చాలా కొత్త పాయింట్ ఉంది. ‘సామజవరగమన’ ట్రైలర్‌లో చూస్తే అసలు కాన్ఫ్లిక్ట్ మేము రివీల్ చేయలేదు. ఇంటర్వెల్ దగ్గర అసలు కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అది ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చింది. ఈ సినిమాలో కూడా ఒక కొత్త కాన్సెప్ట్ ఉంది. మేము ఇప్పుడే రివీల్ చేయడం లేదు. దాన్ని బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిందే.
-శర్వా ‘బైకర్’ సినిమా చేశారు. ఆ సినిమా కోసం చాలా కొత్తగా మేకోవర్ అయ్యారు. అది మాకు కలిసి వచ్చింది. మేము ఫస్ట్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్, తర్వాత ప్రెజెంట్ సీన్స్ చేశాం. ఆ రెండిటికీ పర్ఫెక్ట్‌గా లుక్ సెట్ అయింది.
-శర్వా ఎంటర్టైన్మెంట్ సినిమాలు అదరగొట్టేస్తారు. ‘రన్ రాజా రన్, ఎక్స్ ప్రెస్ రాజా, మహానుభావుడు..’ తర్వాత ఆయన చేసిన ఎంటర్టైనర్ ఇది. ఈ సినిమాలో ఒక మంచి కామియో రోల్ వుంది. శ్రీవిష్ణుతో నాకు మంచి స్నేహం వుంది. ఆయన అడిగినవెంటనే నచ్చి చేశారు. నా నెక్స్ట్ సినిమా శ్రీ విష్ణుతో క్రైమ్ కామెడీ జోనర్‌లో చేస్తున్నాను.
-సంక్రాంతి సినిమా రిలీజ్‌కి అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే థియేటర్‌కి వచ్చిన ఆడియన్స్ సినిమా బాగుందని బయటికి వెళ్తే దానితో వచ్చే మౌత్ టాక్ సినిమాని బలంగా నిలబెడుతుంది. ‘సామజవరగమన’ అలానే విజయవంతమైంది.
సరికొత్త పాయింట్‌తో..
- Advertisement -
- Advertisement -



