Sunday, January 11, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఅందరూ కనెక్ట్‌ అయ్యే సినిమా

అందరూ కనెక్ట్‌ అయ్యే సినిమా

- Advertisement -

రవితేజ హీరోగా కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో సుధాకర్‌ చెరుకూరి ఎస్‌ఎల్‌వి సినిమాస్‌ బ్యానర్‌పై నిర్మించిన చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. డింపుల్‌ హయతి, ఆషికా రంగనాథ్‌ కథనాయికలుగా నటించిన ఈ చిత్రం ఈనెల 13న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్లు డింపుల్‌ హయతి, ఆషికా రంగనాథ్‌ మీడియాతో ముచ్చటించారు.

మోడ్రన్‌ గర్ల్‌గా..
‘డైరెక్టర్‌ కిషోర్‌ తిరుమల చెప్పిన ఈ కథ నాకెంతో బాగా నచ్చింది. కథ వింటున్న ప్పుడే ఇందులో మోడ్రన్‌ గర్ల్‌ పాత్ర చేయాలని అనుకున్నాను. ‘నా సామిరంగతో’ పోల్చుకుంటే ఇది కంప్లీట్‌గా డిఫరెంట్‌ క్యారెక్టర్‌. ఖచ్చితంగా నా కెరీర్‌లో చాలా కొత్తగా ఉంటుంది. ఇందులో నా పాత్ర పేరు మానస శెట్టి. ఇప్పుడున్న అమ్మాయిలు రిలేట్‌ అయ్యే క్యారెక్టర్‌. రవితేజ ఎనర్జీని మ్యాచ్‌ చేయడం చాలా కష్టం.అయితే డైరెక్టర్‌ చాలా సపోర్ట్‌ చేశారు. ఆయన చాలా సెన్సిబుల్‌ డైరెక్టర్‌. మా పాత్రలని చాలా జాగ్రత్తగా డిజైన్‌ చేశారు. ఇప్పుడున్న రిలేషన్షిప్స్‌లో చాలా కాన్ఫ్లిక్ట్స్‌ ఉన్నాయి. అలాంటి అంశాలని దర్శకుడు అద్భుతంగా, అందరూ రిలేట్‌ అయ్యేలా హ్యాండిల్‌ చేశారు. ఇందులో సత్య నా పీఏ క్యారెక్టర్‌లో కనిపిస్తారు. అది చాలా మంచి నవ్వులు పంచే క్యారెక్టర్‌. రవితేజ, సునీల్‌, వెన్నెల కిషోర్‌, సత్య అందరూ కూడా అద్భుతమైన కామెడీ టైమింగ్‌ వున్న నటులు. వాళ్ళ టైమింగ్‌ని మ్యాచ్‌ చేయడం ఛాలెంజ్‌గా అనిపించింది. ఇందులో మాస్‌ సాంగ్‌ చేసినప్పుడు చిరంజీవి సెట్స్‌లోకి రావడం మెమరబుల్‌ ఎక్స్‌ పీరియన్స్‌. ప్రస్తుతం ‘విశ్వంభర, సర్దార్‌ 2’ చిత్రాలు చేస్తున్నాను. అలాగే ‘అది నా పిల్లరా’ అనే మరో సినిమా చేస్తున్నాను’ అని అషికా రంగనాథ్‌ చెప్పారు.

బాలామణిగా అలరిస్తా..
‘రవితేజతో ఇది నా రెండో సినిమా. ఇందులో బాలామణి పాత్రలో కనిపిస్తా. నాది వెరీ స్ట్రాంగ్‌ ఇండిపెండెంట్‌ క్యారెక్టర్‌. డైరెక్టర్‌ నా క్యారెక్టర్‌ని చాలా అద్భుతంగా డిజైన్‌ చేశారు. బాలామణి పాత్రలో కనిపించడం కొత్త ఎక్స్‌పీరియన్స్‌. ఈ సినిమాలో ఒక సర్‌ప్రైజ్‌ ఎలిమెంట్‌ ఉంది. అది మీరు సినిమాలోనే చూడాలి. ఈ కథ అందరికీ కనెక్ట్‌ అవుతుంది. కామెడీ చాలా సెన్సిబుల్‌గా ఉంటుంది. ఇందులో డ్యాన్స్‌ నెంబర్స్‌ని కూడా అందరూ మాట్లాడుడుతున్నారు. పాటలకి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. అలాగే మా దర్శకుడు రాసుకున్న డైలాగ్స్‌ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఆయన మార్క్‌తో ఉండే ఈ సంభాషణలు అందర్నీ బాగా నవ్విస్తాయి. ఓ మంచి సినిమాతో సంక్రాంతికి మీ ముందుకు రావడం ఆనందంగా ఉంది’ అని మరో కథానాయిక డింపుల్‌ హయతి అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -