రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలి :ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
నగరంలోని వెస్ట్ మారేడుపల్లి ప్రభుత్వ జూనియర్ మహిళా కళాశాల విద్యార్థిని మృతిచెందిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ హైదరాబాద్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లెనిన్ గువేరా, అశోక్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ ఘటనపై వారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. లెక్చరర్ల దురుసు ప్రవర్తన, అవమానకర వ్యాఖ్యల కారణంగానే విద్యార్థిని మనస్తాపానికి గురై మరణించిందని పేర్కొన్నారు. విద్యార్థిని మృతికి కారణమైన లెక్చరర్లు శ్రీలత, మధురిమను తక్షణమే సస్పెండ్ చేసి కఠినంగా శిక్షించాలని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులను, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సదరు లెక్చరర్లను విధుల నుంచి శాశ్వతంగా తొలగించాలని, చనిపోయిన విద్యార్థిని కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందించాలని పేర్కొన్నారు. కళాశాలల్లో ఇలాంటి అమానవీయ ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థిని మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకునే వరకు పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
విద్యార్థిని మృతికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



