Friday, May 23, 2025
Homeతాజా వార్తలుపుష్కర స్నానానికి వెళ్లి మృతి..!

పుష్కర స్నానానికి వెళ్లి మృతి..!

- Advertisement -
  • – ఆటో, కారు ఢీకొని ఇద్దరు మృతి…
    నవతెలంగాణ – మల్హర్ రావు(కాటారం)
  • సరస్వతి పుష్కరాలకు వెళ్లి వస్తున్న కారు, పుష్కరాలు వెళ్తున్న ఆటో గురువారం భూపాలపల్లి-కాటారం జాతీయ రహదారిపై భూపాలపల్లి మండలం కమలాపూర్ క్రాస్ కు రెండు కిలోమీటర్ల సమీపంలో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. వివరాలలోకి వెళితే హైదరాబాద్ చెందిన ఓకుటుంబం పుష్కర స్నానం ముగించుకొని కాళేశ్వరం నుండి వాగనార్ కారులో భూపాలపల్లి వైపు వస్తున్న క్రమంలో జయశంకర్ జిల్లా చిట్యాల మండలం నైన్ పాక శివారు కుమ్మరిపల్లి గ్రామానికి చెందిన మరో కుటుంబం 8 మంది ఆటోలో పుష్కర స్నానానికి కాళేశ్వరానికి వైపు వెల్తుండగా కారు-ఆటో ఎదురెదురుగా ఢీ కొన్నాయి. కాగా ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తుల కాళ్ళకు, చేతులకు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే కారులో ప్రయానిస్తున్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్సు లో భూపాలపల్లి వంద పడకల ఆసుపత్రి కి తరలించగా కుమ్మరపల్లికి చెందిన విష్ణు, రజిత మార్గమధ్యలోనే మృతి చెందాగా మరో ఇద్దరు నరసింహ, ఫిష్రూత్ ల పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజిఎంకు తరలించారు. మిగతా క్షతగాత్రులకు భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రి లోనే చికిత్స అందిస్తున్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -