Sunday, January 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్‌ మినహాయింపు ఇవ్వాలి

సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్‌ మినహాయింపు ఇవ్వాలి

- Advertisement -

అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో.. రాష్ట్ర వ్యాప్తంగా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన
నవతెలంగాణ-మఫిషల్‌ టీమ్‌

సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్‌ మినహాయింపు ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వం, ఎన్సీటీఈ జోక్యం చేసుకుని సీనియర్‌ ఉపాధ్యాయుల ఉద్యోగాలకు రక్షణ కల్పించాలని, సీపీఎస్‌ రద్దు చేయాలని తదితర ఉపాధ్యాయుల సమస్యలపై ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (ఏఐజేఐసీటీవో) ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి పాఠశాలలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు చావ రవి, జి సదానందం గౌడ్‌, పి మల్లికార్జున్‌ రెడ్డి, ఎ వెంకట్‌, జుట్టు గజేందర్‌, పోల్‌ రెడ్డి, కె శారద మాట్లాడారు. పాఠశాలల మూసివేత, విలీనాన్ని నిలిపివేయాలని, జాతీయ విద్యావిధానాన్ని సమీక్షించి ప్రభుత్వ విద్యకు నష్టం కలిగించే అంశాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు ఓటుహక్కు కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. ఈ సమస్యలపై ఫిబ్రవరి 5న జరిగే పార్లమెంటు మార్చ్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నిరసనలకు యూయస్పీసీ, జాక్టో, ఏస్జీటీయూ తదితర సంఘాలు మద్దతు ప్రకటించాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -