– ముగ్గురు వలస కూలీలు మృతి
– మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
నవతెలంగాణ-మిర్యాలగూడ
సిమెంట్ ట్యాంకర్‌ను డీసీఎం ఢీకొట్టడంతో అందులో ఉన్న ముగ్గురు వలస కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడ చౌరస్తా వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి థర్మల్ ప్రాజెక్టు నుంచి సిమెంటు లోడుతో హైదరాబాద్‌కు వెళ్తన్న సిమెంట్ ట్యాంకర్‌ను శంషాబాద్ నుంచి గుంటూరుకు ఇటాలియన్ మార్బుల్ లోడుతో వెళ్తున్న డీసీఎం ఢీకొట్టింది. దీంతో అందులోని వలస కూలీలపై మార్బుల్స్ పడటంతో బీరుబాయ్(30), సంతోష్(30), సూరజ్(18) అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు సుజిత్ కుమార్, కిషన్, సికిందర్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని మిర్యాలగూడ ఏరియాస్పత్రికి తరలించారు. వీరంతా బీహార్‌కు చెందిన కూలీలుగా గుర్తించారు. క్రేన్ సహాయంతో వాహనాలను పోలీసులు పక్కకు జరిపి రాకపోకలకు ఆటకం లేకుండా చేశారు. ఘటనా స్థలాన్ని మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు, వన్‌టౌన్ సీఐ నాగభూషణరావు పరిశీలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
సిమెంట్ ట్యాంకర్‌ను ఢీ కొట్టిన డీసీఎం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



