– క్యాలెండర్ కమ్ ప్లానర్ – 2026
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ ఉన్నత విద్యామండలి 2026 ఏడాది క్యాలెండర్ కమ్ ప్లానర్‌ను వినూత్నంగా రూపొందించింది. శుక్రవారం హైదరాబాద్‌లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మండలి చైర్మెన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి క్యాలెండర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మండలి వైస్ చైర్మెన్-1 ప్రొఫెసర్ ఇ.పురుషోత్తం, వైస్ చైర్మెన్-2 ప్రొఫెసర్ ఎస్.కె.మహమూద్, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్‌తో పాటు మండలి సిబ్బంది పాల్గొన్నారు. గతేడాది దేశానికి చెందిన మహనీయులను గౌరవించి గుర్తు చేసుకునేలా క్యాలెండర్ ను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఉన్నత విద్యపై పెద్ద ఎత్తున చర్చకు దారి తీసేలా భిన్నమైన లక్ష్యంతో రూపొందించారు. ప్రపంచ జ్ఞానం, సమాచార వ్యాప్తి, ప్రజాస్వామ్యీకరణలో పాత్ర పోషించిన మేధావులు, పండితులు, క్రియాశీలకంగా వ్యవహరించిన వారి ద్వారా ఉన్నత విద్యపై చర్చను ముందుకు తీసుకెళ్లాలని మండలి సంకల్పించింది. వారు సామాజిక-నైతిక విలువలు, విమర్శనాత్మక ఆలోచన, మేధోపరమైన పరిశోధన, విద్యార్థుల పట్ల మానవీయత, నిరంతర అభ్యాసం, తరగతి గదిలో ప్రజాస్వామ్యం, సమస్య పరిష్కార పద్ధతులు, విద్యార్థి-కేంద్రీకృత విధానాలు, అనుభవపూర్వక అభ్యాసం, ఉపాధ్యాయ శిక్షణ, విభిన్నత (డైవర్సిటీ), అలాగే సిలబస్‌లో ప్రపంచ దృక్పథాలను పొందుపరచడంలో విశేష సేవలందించినట్టు ఈ సందర్భంగా బాలకిష్టారెడ్డి తెలిపారు.
వినూత్నంగా ఉన్నత విద్యా మండలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



