నవతెలంగాణ -ముధోల్ : ముధోల్ మండలంలోని చించాల గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణంకు ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 20లక్షల రుపాయల నిధులు మంజూరు చేసిందని గ్రామ సర్పంచ్ దొడ్డి కింది సర్వేష్, ఉపసర్పంచ్ పీసర సాయినాథ్ గౌడ్ లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే గెలిపొందిన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు, యూత్ సభ్యులు మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆనంతరం మా గ్రామానికి నూతన పంచాయతీ భవనంకు నిధులు మంజూరు చేయించాలని వారు కోరారు. ఈ విషయం జిల్లా ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, కలెక్టర్ అభిలాష అభినవ్ దృష్టికి తీసుకెళ్లి మంజూరుకు కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. దీంతో నిధులు మంజూరు పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఇంఛార్జి మంత్రి, కలెక్టర్, మాజీ ఎమ్మెల్యేకు ప్రత్యేకంగా వారు కృతజ్ఞతలు తెలిపారు.
పంచాయతీ భవనంకు నిధులు మంజూరు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



