నవతెలంగాణ – ముధోల్
ముధోల్ మండలంలోని ఆయా గ్రామాల్లో వివో భవనాలకు, గ్రామపంచాయతీ భవనాలకు, పాఠశాల అభివృద్ధికి రూ.70 లక్షల నిధుల మంజూరు కావటం పట్ల మాజీ పిఎసిఎస్ చేర్మన్ సురేందర్ రెడ్డి శనివారం ఒక్క ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. తరోడ పాఠశాల కాంపౌండ్ వాల్ నిర్మాణానికి రూ.10 లక్షలు, వివో భవనంకు రూ.10లక్షలు, విట్టోలి గ్రామంలో పాఠశాల కాంపౌండ్ వాల్ కు రూ.10 లక్షలు, వివో భవనానికి రూ.10 లక్షలు, విట్టోలి తండాకు రూ.10 లక్షలు, చించాల గ్రామపంచాయతీ భవనానికి రూ.20 లక్షల నిధులు ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి విజ్ఞప్తి మేరకు మంజూరు అయ్యాయన్నారు. నిధుల మంజూరుకు కృషి చేసిన జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, కలెక్టర్ అభిలాష అభినవ్, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు.
నిధుల మంజూరుపై హర్షం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



