Sunday, January 11, 2026
E-PAPER
Homeజాతీయంమద్యం మత్తులో ఓ కారు డ్రైవ‌ర్ బీభ‌త్సం..వీడియో

మద్యం మత్తులో ఓ కారు డ్రైవ‌ర్ బీభ‌త్సం..వీడియో

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: క‌ర్నాట‌క‌లో మద్యం మ‌త్తులో ఓ కారు డ్రైవ‌ర్ బీభ‌త్సం సృష్టించారు. 42 ఏళ్ల డెరిక్ టోనీ అనే వ్యక్తి తన స్కోడా కారులో 18వ మెయిన్ రోడ్డు నుండి 100 అడుగుల రోడ్డు వైపు వెళ్తున్నాడు. ఆ సమయంలో అతను మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతివేగంతో పాటు మద్యం సేవించి ఉండటంతో కారుపై నియంత్రణ కోల్పోయాడు. రోడ్డు వద్ద ఎడమ వైపునకు తిరగాల్సి ఉండగా అతివేగం కారణంగా టోనీ కారును తిప్పలేకపోయాడు. కారు నేరుగా వెళ్లి డివైడర్‌ను ఎక్కి అవతలి వైపునకు దూసుకెళ్లింది. దారిలో ఉన్న ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు, చివరకు అక్కడే ఉన్న ‘బార్బెక్యూ నేషన్’ రెస్టారెంట్ గోడను బలంగా ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో రెస్టారెంట్ గోడ పూర్తిగా దెబ్బతినింది. ప్ర‌మాద స‌మ‌యంలో అక్క‌డే ఉన్న ప‌లువురు క‌స్ట‌మ‌ర్లు తృటిలో ప్రాణాల‌ను కాపాడుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -