– హుస్నాబాద్ ను బలవంతంగా సిద్దిపేటలో కలిపారు
రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
ఎరువుల లోటు ఎక్కడ లేదని సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశించారు. శనివారం హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో నియోజకవర్గ వ్యవసాయ అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశ నిర్వహించారు. రైతులు క్యూలైన్ లలో నిలబడే పరిస్థితి రావద్దన్నారు. నియోజకవర్గంలో ఎరువులు లోటు లేకుండా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మూడు జిల్లాల కలెక్టర్ లతో మాట్లాడినట్టు చెప్పారు.
హుస్నాబాద్ వ్యవసాయాధికారులు రాష్ట్రానికి రోల్ మోడల్ గా ఉండాలన్నారు. త్వరలో నర్మేట లో నిర్మితమైన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ముఖ్యమంత్రి చే ప్రారంభం అవుతుందన్నారు. ఆయిల్ ఫామ్ సాగు పై 5 ఎకరాల పైన ఉన్న రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. రైతుల సమస్యలు ,వ్యవసాయ అనుబంధ పథకాలు ,పంటల విధానం ,యాంత్రీకరణ ,పంటల సాగు అమలు పై యాక్షన్ ప్లాన్ రూపొందించాలన్నారు.ఈ సమీక్షా సమావేశంలో డీవీఏహెచ్ వో లు, ఏడీఏ లు , డీహెచ్ ఎస్వో లు , డీఏవో లు, ఎంఏవో లు, ఏఈవో లు, వీఏఎస్ లు , హెచ్ వో లు , ఏవో లు పాల్గొన్నారు.
హుస్నాబాద్ ను బలవంతంగా సిద్దిపేటలో కలిపారు: మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్ ప్రాంత ప్రజలు కరీంనగర్ జిల్లాలో ఉండాలని ప్రజల ఆకాంక్ష అని బలవంతంగా హుస్నాబాద్ ను సిద్దిపేట జిల్లాలో కలిపారని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. హుస్నాబాద్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు హుస్నాబాద్ ప్రజలకు కాంగ్రెస్ పీసీసీ హోదాలో సీఎం రేవంత్ రెడ్డి హుస్నాబాద్ ను కరీంనగర్ లో కలుపుతానని ప్రకటించినట్లు చెప్పారు. స్థానిక శాసన సభ్యుడిగా ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయానని తెలిపారు. ఎప్పుడైనా సరిహద్దుల మార్పు , జిల్లాల సైంటిఫిక్ మెథడ్ లో మార్పులు చేర్పులు జరిగితే ఈ ప్రాంతం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కరీంనగర్ లో కలపడం తధ్యం అని పేర్కొన్నారు.



