- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం లచ్చన్ గ్రామానికి చెందిన మీరేవార్ సాయిలు కామారెడ్డి జిల్లా జాగృతి ఉపాధ్యక్షులుగా నియమితులు కావడం పట్ల గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గ్రామంలో ఆయనకు గ్రామ పెద్దలు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సన్మాన కార్యక్రమంలో జిల్లా స్థాయి పదవిని చేపట్టిన మీరేవార్ సాయిలు కు గ్రామ ప్రతినిధులు శాలువాతో సత్కరించి, అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ.. సాయిలు జిల్లా స్థాయిలో కీలక బాధ్యతలు చేపట్టడం గ్రామానికి గర్వకారణమని, తమ పదవి ద్వారా జిల్లా, సామాజిక సేవా కార్యక్రమాలకు మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.
- Advertisement -



