- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ఢిల్లీ లోని ఎన్ పి టి సి లిమిటెడ్ ప్రధాన కార్యాలయంలో ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ టిపి సిఎండి గురుదీప్ సింగ్ ని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ భువనగిరి లోకసభ నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల కోసం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులను కేటాయించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు అవసరమైన మౌలిక వసతులు, పరికరాలు అందించి, పేద అవసరమున్న వారికి మెరుగైన సేవలు అందించేందుకు ఈ నిధులు అవసరం అవుతాయని తెలిపారు.
- Advertisement -