Sunday, January 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వృత్తివిద్య కోర్సులకు ఉచిత శిక్షణ 

వృత్తివిద్య కోర్సులకు ఉచిత శిక్షణ 

- Advertisement -

నవతెలంగాణ – టేకుమట్ల
నిరుద్యోగ యువతి యువకులకు ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తామని భూపాలపల్లి జిల్లా ప్రథమ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ సంస్థ కోఆర్డినేటర్ బాబు మైస ఒక ప్రకటనలో తెలిపారు. టేకుమట్ల మండల కేంద్రంలోని నిరుద్యోగ యువతి యువకులకు  ఎలక్ట్రిషను, బ్యూటీషియన్ నర్సింగు, హోటల్ మేనేజ్మెంట్, మెకానికల్ ,డేటా ఎంట్రీ ఆపరేటర్ పలు కోర్సుల్లో ఉచిత శిక్షణ తో పాటు ఉచిత వసతి,భోజనం యూనిఫాం,స్టడీ మెటీరియల్, షూస్, బ్యాగ్స్,అందజేయడం జరుగుతుందని, శిక్షణ పూర్తి అయిన తర్వాత ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.

ఉచిత శిక్షణకు 52 రోజుల కాలవ్యవధి అని,వరంగల్ హైదరాబాదు పట్టణంలో శిక్షణ కేంద్రాలు ఉన్నాయని 18 నుంచి 30 సంవత్సరాల వయసు ఉండి ఐటిఐ ,డిగ్రీ, డిప్లమా, ఒకేషనల్ కోర్సులు చదువుతున్న  అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులని పేర్కొన్నారు. 13.01. 2026 న ఆసక్తి,అర్హత కలిగిన అభ్యర్థులు తమ జిరాక్స్ పత్రాలతో మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీస్ వద్ద జాబ్ మేళాకు హాజరు కావలసిందిగా తెలిపారు. 9014 697041 నెంబర్ కు సంప్రదించి దరఖాస్తులను నమోదు చేసుకోవాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -