Sunday, January 11, 2026
E-PAPER
Homeజిల్లాలుస్టేషన్ ఘన్ పూర్ కు గత పాలకులు చేసిందేమీ లేదు

స్టేషన్ ఘన్ పూర్ కు గత పాలకులు చేసిందేమీ లేదు

- Advertisement -

వరంగల్ ఎంపీ. డా. కడియం కావ్య వ్యాఖ్య
నవతెలంగాణ – స్టేషన్ ఘనపూర్ 

20 ఏండ్ల కిందట కడియం శ్రీహరి చేసిన అభివృద్ధి పనులు, అలాగే ప్రస్తుత రెండేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధియే స్టేషన్ ఘనపూర్ పరిధిలో కనబడుతుందని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. నియోజక వర్గానికి చీడపురుగులా అంతకుముందు బకాసురుడులా, కుంభకర్ణుడిలా తిని, పడుకుని, మళ్ళీ ఆచెత్త మాటలు, చెత్తవాగుడు తప్పితే, స్టేషన్ ఘనపూర్ కు గత పాలకులు చేసిన అభివృద్ధి ఏమి లేదని విమర్శించారు. గతంలోలాగా పగటి కలలతో మరలా ప్రజల ముందుకు వస్తున్నారని, ప్రజలెవరూ సమయం వృథా చేసుకోకుండా తరిమికొట్టాలని అన్నారు.

శనివారం నియోజక వర్గ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం మంజూరి చేసిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనుల ప్రారంభోత్సవ సమావేశంలో ఎంపీ హాజరై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నియోజక వర్గంపై సీఎం రేవంత్ రెడ్డి సహకారం ఎనలేనిదని, ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై ఆయనకున్న గౌరవం, నమ్మకంతో ఏడాదిన్నర కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో రూ. 14 వందల కోట్ల అభివృద్ధి పనులు మంజూరు చేశారని పేర్కొన్నారు. పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులన్నీ పూర్తయితే స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గ రూపురేఖలు మారుతాయని అన్నారు. రానున్న ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. పుట్టినిల్లులాంటి నియోజక వర్గం అభివృద్ధికి, రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ఈప్రాంత అభివృద్ధిపై మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -