Sunday, January 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్టీఎన్జిఓఎస్ క్యాలెండర్ ఆవిష్కరణ 

టీఎన్జిఓఎస్ క్యాలెండర్ ఆవిష్కరణ 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్,టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు  నాశెట్టి సుమన్ కుమార్, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ అధ్యక్షతన జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అధికారిక పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రానికి విచ్చేసిన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డిని, టీఎన్జీవోస్ పక్షాన మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. అనంతరం నూతనంగా బదిలీపై విచ్చేసి పదవి బాధ్యతలు స్వీకరించిన  కలెక్టర్ జిల్లా మెజిస్ట్రేట్ ఇలా త్రిపాటి ని, టిఎన్జీవోస్ పక్షాన మర్యాదపూర్వకంగా కలిసి,శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాష్ట్ర ముఖ్య సలహాదారులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి ఇరువురు టీఎన్జీవో -2026 క్యాలెండర్ ను ఆవిష్కరించి, టీఎన్జీవో జిల్లా అధ్యక్ష కార్యదర్శులకు జిల్లా కార్యవర్గ సభ్యులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వీరితోపాటు టీఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షులు గైని గంగారం, రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మచ్చుకూరి సతీష్, జిల్లా సహాధ్యక్షులు పెద్దోళ్ల నాగరాజు, చిట్టి నారాయణరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు అతిక్ అహ్మద్, జాఫర్ హుస్సేన్, శివకుమార్, జాకీర్ హుస్సేన్, మారుతి, భీమ్గల్ యూనిట్ అధ్యక్షులు సృజన్ కుమార్, ఆర్మూర్ యూనిట్ కార్యదర్శి విశాల్, బోధన్ యూనిట్ అధ్యక్షులు రాజశేఖర్ సర్వే స్పెషల్ యూనిట్ కార్యదర్శి నగేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు మహేందర్, ప్రకాష్, పార్థసారథి,గురుచరణ్, లక్ష్మీనారాయణ, విశాల్ రెడ్డి, విజయలక్ష్మి, మంగమ్మ, స్వామి, సునీల్, టీఎన్జీవో సలహాదారులు వనమాల సుధాకర్ గారు క్లాస్ ఫోర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నేరేళ్ల శ్రీనివాస్, సర్దార్ బిరేందర్ సింగ్, అర్బన్ రేట్ కార్యవర్గ సభ్యులు సంధ్యారాణి, శ్రీప్రియ, నవనీత మరియు వివిధ శాఖల ఫోరం అధ్యక్ష కార్యదర్శులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరై టీఎన్జీవో క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -