నవతెలంగాణ-హైదరాబాద్ : దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 260 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో అత్యధిక కేసులు గుర్తించబడ్డాయి. వీటిలో కొన్ని కేసులు ఒమిక్రాన్ JN.1 వేరియంట్ కు సంబంధించినవి కూడా ఉన్నాయి. దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ ప్రజలకు, అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ వాడాలని, దూరం పాటించాలని ప్రజలకు సూచించింది.
ఆసుపత్రుల్లో కోవిడ్ వార్డులు, టెస్టింగ్ కిట్స్, ICU బెడ్స్, ఆక్సిజన్, వెంటిలేటర్లు సిద్ధం చేయాలని రాష్ట్రాలకు కీలక ఉత్తర్వులు విడుదల చేసింది. కాగా ఇటీవల ముంబై కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ ఆసుపత్రిలో ఇద్దరు(59 ఏళ్ల మహిళ, 14 ఏళ్ల బాలుడు) కోవిడ్‌తో మరణించారు. దీంతో కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తం అయ్యి రాష్ట్రాలకు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు పరిస్థితి అదుపులో ఉందని, భయపడాల్సిన అవసరం లేదని కేంద్రం తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వేరియంట్ తక్కువ ప్రమాదకరమైనదే అని, కానీ జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
దేశంలో కరోనా..కేంద్రం హెచ్చరికలు జారీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES