Sunday, January 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కమ్మర్ పల్లిలో కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం

కమ్మర్ పల్లిలో కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం

- Advertisement -

నవతెలంగాణ- కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలోని 63వ నంబర్ జాతీయ రహదారిపై ఉప్లూర్ చౌరస్తా వద్ద యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి పిలుపుమేరకు కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ కౌడ శైలేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ వెనక్కి తీసుకొని వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

 ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నిమ్మ రాజేంద్రప్రసాద్, మాజీ కోఆప్షన్ పాషా, యూత్ కాంగ్రెస్ నాయకులు వేములవాడ జగదీష్, నల్ల సాయికుమార్ వాల్గొట్ రంజిత్, ఎడ్ల దీపక్, సంపంగి నాగరాజ్, శివసారం నరేష్, పీర్ల అరవింద్, చంద్రకాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -