• పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి
• కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
నవతెలంగాణ -పెద్దవంగర
నిరుపేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో పాలన కొనసాగిస్తుందని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రైతు వేదికలో 28 మంది కల్యాణలక్ష్మి, షాది ముబారక్ లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం గ్రామ సర్పంచ్ ముద్దసాని పారిజాత సురేష్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రసంగించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందన్నారు. పేద యువతుల వివాహాలకు కల్యాణ లక్ష్మి గొప్ప పథకంగా నిలుస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను అందిస్తామని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తుందని స్పష్టం చేశారు. పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను అర్హులకు అందిస్తున్నామని వ్యాఖ్యానించారు. రైతులు ఎవరు ఆందోళన చెందోద్దని, అన్నదాతకు సరిపడా యూరియా అందించేలా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ప్రభుత్వ పథకాలను ప్రతి గడపకు చేరేలా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్, సీనియర్ నాయకులు డాక్టర్ సంకెపల్లి రవీందర్ రెడ్డి, సర్పంచులు మురళీ, శంకర్, శ్రీనివాస్, శ్రీదేవి, దేవా, యాకలక్ష్మి, ఉపసర్పంచ్ వినోద్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దేవేంద్ర, బెడద మంజుల, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు హరికృష్ణ, ఉపాధ్యక్షుడు మహేష్, లింగమూర్తి, బాషా, రాములు, సురేష్, సంపత్, యాకయ్య, తదితరులు పాల్గొన్నారు.



