Sunday, January 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎం సహాయ నిధి పేదలకు వరం: ఎమ్మెల్యే పోచారం 

సీఎం సహాయ నిధి పేదలకు వరం: ఎమ్మెల్యే పోచారం 

- Advertisement -

నవతెలంగాణ – నసురుల్లాబాద్  
పేద ప్రజలు అనారోగ్యానికి గురి అయితే ఆపద సమయంలో సీఎం సహాయనిధి పేదలకు వరం లాంటిదని రాష్ట్ర వ్యవసాయ ప్రభుత్వం సలహాదారులు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం బాన్సువాడ పట్టణంలో బీర్కూర్ నసరుల్లాబాద్ తదితర మండలాల లబ్దిదారులకు సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. బాన్సువాడ నియోజక వర్గంలోని 341 మంది ముఖ్యమంత్రి సహాయ నిది లబ్ధిదారులకు రూ 1,10,05,500 ల చెక్కులను బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అగ్రోస్ ఛైర్మన్ శ్రీ కాసుల బాలరాజు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు.

ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహార్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. పేదప్రజలను ఆదుకునేందుకే ముఖ్యమంత్రి సహాయనిధి ఉందని ఆయన గుర్తు చేశారు. నసురుల్లబాద్ మండలం 41 మంది లబ్దిదారులకు రూ 13,17,000 రూపాయలు,బీర్కూర్ మండలం 31,లబ్ధిదారులకు రూ 8,74,500లు,బాన్సువాడ గ్రామీణ మండలం 41 మంది లబ్ధిదారులకు రూ 13,56,500, బాన్సువాడ మున్సిపాలిటీ 32 మంది లబ్ధిదారులకు రూ 9,94,000 రూపాయల చెక్కులను అందజేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పేర్క శ్రీనివాస్ , నాయకులు మారుతి పటేల్, మైశాగౌడ్, ఖలీల్, భాను గౌడ్, పాల్త్య విఠల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -