నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
ముగ్గుల పోటీలు, కబడ్డీ ఆటలు సృజనాత్మకతకు మంచి అవకాశం అని కరెస్పాండెంట్ ఎస్ కె. మంజు బాబా, స్కూల్ ప్రిన్సిపల్ ప్యారి బేగం అన్నారు. శనివారం, యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గోల్కొండ ప్రాధమిక పాఠశాల, సంక్రాంతి సంబరాల సందర్భంగా ముగ్గుల పోటీలు, కబడ్డీ పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు తమ సృజనాత్మకతకు ఇదొక మంచి అవకాశంగా భావించి చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థుల తల్లితండ్రులు ముగ్గుల పోటీలో మొదటి విజేత బి. లక్ష్మి, రెండవ విజేత బి. సంధ్య, మూడవ విజేత జి. రజిత విజేతగా నిలిచారు. కబడ్డీ పోటిల్లో ప్రణిత టీమ్, లావణ్య టీమ్ విజేతగా నిలిచాయి. గెలుపు ఓటమితో సంబంధం లేకుండా మహిళలు తమ ప్రతిభని చాటారు. ఈ కార్యక్రమం లో డైరెక్టర్ ఎస్ కె. ఉస్మాన్ షరీఫ్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
ముగ్గుల పోటీలు, ఆటలు సృజనాత్మకతకు మంచి అవకాశం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



