Sunday, January 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామీణ క్రీడాకారులు ఆదర్శప్రాయం..

గ్రామీణ క్రీడాకారులు ఆదర్శప్రాయం..

- Advertisement -

– సర్పంచ్ కేతావత్ అంజమ్మహన్మంతు
నవతెలంగాణ – ఊరుకొండ 

గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువత చెడు మార్గంలో పడకుండా గ్రామాల్లో నిర్వహించే గ్రామీణ క్రీడలు ఆదర్శప్రాయమని సర్పంచ్ కేతావత్ అంజమ్మహన్మంతు అన్నారు. శనివారం ఊరుకొండ మండల పరిధిలోని బాల్య లోక్య తండాలో  బిఎల్టి సీజన్ 3 క్రికెట్ టోర్నమెంట్ ను స్థానిక సర్పంచ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కేతవత్ అంజమ్మ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికే ఇటువంటి క్రీడలు దోహదపడతాయని తెలిపారు. యువత కేవలం ఆటలకే పరిమితం కాకుండా, క్రమశిక్షణతో కూడిన జీవనాన్ని అలవర్చుకుని దేశ భవితకు ఆదర్శంగా నిలవాల న్నారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని, సోదరభావాన్ని పెంపొందిస్తాయి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ జరుపులవత్ తిరుపతి, రవి గ్రామ పెద్దలు, యువకులు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -