Sunday, January 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జిల్లా వ్యాప్తంగా చైనా మాంజా విక్రయాలపై విస్తృత తనిఖీలు

జిల్లా వ్యాప్తంగా చైనా మాంజా విక్రయాలపై విస్తృత తనిఖీలు

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిషేధిత చైనా మాంజా విక్రయాలు జరగకుండా పోలీస్ శాఖ ప్రత్యేకమైన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగముగా నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని మండల కేంద్రాలు , గ్రామాలలో, మారిముల ప్రాంతాలలో గాలిపటాల దుకాణాలను, స్టేషనరీ షాపులను , తాత్కాలిక విక్రయ కేంద్రాలను పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టడం జరిగింది. నిషేధిత చైనా మాంజాను ఎవరైనా విక్రయించిన , నిలువ ఉంచిన , రవాణా చేసిన వారిపై చట్ట ప్రకారము కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సంబంధిత అధికారులు స్పష్టం చేయడం జరిగింది.

చైనా మాంజా వలన మనుషులకు ముఖ్యంగా ద్విచక్ర వాహనాదారులకు , చిన్నారులకు తీవ్రమైన ప్రమాదం పొంచి ఉందని అలాగే పక్షులు పర్యవరణానికి తీవ్ర నష్టం కలుగుతుందని సంబంధిత పోలీసులు హెచ్చరించడం జరిగింది.గతంలో చోటు చేసుకున్నటువంటి ప్రమాదాలు ప్రాణ నష్టాలు నేపథ్యంలో చైనా మాంజా వినియోగాని పూర్తిగా నిషేధించడం జరిగిందని , చైనా మాంజా వలన ఎవరైనా వ్యక్తులకు ప్రాణహాని కలిగితే వారిపై హత్యా నేరం క్రింద కేసు నమోదు చేయబడుతుంది.

ఈ సందర్భంగా విక్రయ కేంద్రాల యాజమాన్యాలకు తెలియజేయడం జరిగింది.  ప్రజలు నిషేధిత చైనా మాంజాను కొనుగోలు చేయకుండా సహకరించాలని ఎవరైనా అట్టి మాంజాను విక్రయిస్తున్నట్లు గాని , నిలువ ఉంచినట్లు గాని , రవాణా చేసినట్లు గాని తెలిసినట్లయితే అట్టి సమాచారాన్ని వెంటనే మీ సమీప పోలీస్ స్టేషన్ కు లేదా డయల్ 100 కు సమాచారం అందించాలని తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -