- Advertisement -
నవతెలంగాణ – మిరుదొడ్డి
గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని గ్రామ సర్పంచ్ ముత్యాల బాబాయ్ కొమరయ్య, ఉపసర్పంచ్ మాడురి రాజు అన్నారు. శనివారం మీరు దొడ్డి మండలం కాసులాబాద్ గ్రామంలో అంగన్వాడి భవనానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఎలాంటి సమస్య ఉన్న వెంటనే తమ దృష్టి తీసుకువస్తే పరిష్కారం చేసేదిశగా పనిచేస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తానని వారు తెలిపారు. గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయడానికి యువకులు గ్రామస్తులు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తుమ్మల బాలరాజు గ్రామస్తులు శ్రీనివాసు బిక్షపతి అశోకు నరేష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



