Sunday, January 11, 2026
E-PAPER
Homeక్రైమ్విషాదం.. చేపలవేటకు వెళ్లి ముగ్గురు మృతి

విషాదం.. చేపలవేటకు వెళ్లి ముగ్గురు మృతి

- Advertisement -

నవతెలంగాణ – చిన్నకోడూరు: చెక్ డ్యాంలో పడి ముగ్గురు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నకోడూరు మండలం కస్తూరిపల్లిలోని చెక్ డ్యామ్ లో చేపల వేటకు వెళ్లి ముగ్గురు మృతి చెందినట్టు తెలిపారు. మృతుల్లో తల్లీ కొడుకు ఉన్నారు. బిహార్ నుంచి 5 రోజుల కిందటే రెండు కుటుంబాలు బతుకుదెరువు కోసం కస్తూరిపల్లికి వచ్చారని వెల్లడించారు. దీంతో కస్తూరిపల్లిలో విషాదచాయలు అలుముకున్నాయి. అయితే ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -