Sunday, January 11, 2026
E-PAPER
Homeకవితకలలు కన్నాను నా దేశం ఇలా ఉండాలని...

కలలు కన్నాను నా దేశం ఇలా ఉండాలని…

- Advertisement -

కట్నాలు లేని కళ్యాణాలు,
లంచాలు లేని పనుల ప్రవాహాలు.
అధికారుల గుండెల్లో నిజాయితీ నినాదాలు,
పేదరికం అనే పదం తెలియని దేశాన్ని…
కలలు కన్నాను నా దేశం ఇలా ఉండాలని…
ఒలింపిక్స్‌ వేదికపై పసిడి మెరుపులు,
నూరు దాటిన పతకాల సంఖ్యలు
చదువుకున్న ప్రతీ ఒక్కరికీ ఉద్యోగాలు
నిరుద్యోగం అన్న మాటే లేని దేశాన్ని…
కలలు కన్నాను నా దేశం ఇలా ఉండాలని…
నేర చరిత్ర లేని నాయకులు,
పరిపాలనలో పారదర్శకత.
ఉచిత వైద్యం, ఉచిత విద్యలు,
ప్రతీ అగ్రరాజ్యానికి ఆదర్శనీయత.
ట్రాఫిక్‌ జాము లేని రోడ్లు,
సాఫీగా సాగే ప్రయాణం.
నోటుకు అమ్ముడుపోని ఓట్లు
ప్రతి పౌరుని ధర్మ కర్తవ్యం.
వంద శాతం ఓటింగులు,
ప్రజాస్వామ్యానికి పునాది బలం.
కానీ, కళ్ళు తెరిస్తే తెల్లారింది…
కల ముగిసింది, వాస్తవం వెక్కిరించింది…
అది అసాధ్యం అనుకుందేమో..!
– ధాత్రి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -