మెదక్, మిర్యాలగూడలో కొనసాగుతున్న జీపు జాత
కేంద్ర కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలపై ప్రచారం
నవతెలంగాణ – వెల్దండ/మిర్యాలగూడ/మెదక్
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక, వ్యవసాయ, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కార్మిక, కర్షక పోరుయాత్రలు నడుస్తున్నాయి. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో, మెదక్‌లో జీపు జాతాలు కొనసాగుతుండగా, శనివారం నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో కార్మిక, కర్షక పోరు యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం పేదల పొట్టగొట్టి.. ఆదానీ, అంబానీ లాంటి బడా పెట్టుబడిదారులకు 16 లక్షల కోట్ల రూపాయలు దోచిపెట్టిందని విమర్శించారు. కార్మికు లకు నష్టం కలిగించే విధంగా 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకొచ్చి కార్మిక హక్కులను కాలరాస్తోందన్నారు.
మిర్యాలగూడలో..
లేబర్ కోడ్స్, వీబీజీరామ్‌జీ పథకం, జాతీయ విత్తన, విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని రైతుసంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సీఐటీయూ, ఏఐకేఎస్, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన జీపుజాతా శనివారం మిర్యాలగూడ మండ లంలోని భాగ్యగోపసముద్రం తండా వరకు సాగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వ విధానాలపై ఫిబ్రవరి 12న చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మె జయప్రదం కోసం జిల్లాలో ప్రచార జీపు జాతా చేపట్టామని, అన్ని గ్రామాల్లో కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కార్మికులను కలుస్తూ మోడీ విధానాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈనెల 18న నల్లగొండ కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా నిర్వహిస్తామని, జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
మెదక్‌లో..
మెదక్ జిల్లాలో సీఐటీయూ, తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జనవరి 8 నుంచి ప్రారంభమైన కార్మిక, కర్షక పోరుయాత్ర కొనసాగుతోంది. శనివారం శివ్వంపేట, మనోహరాబాద్, తుప్రాన్, ముసాయిపేట వెల్ధుర్తి మండలాల్లో జీపు జాత నిర్వహించారు.
వెల్దండలో కార్మిక కర్షక పోరుయాత్ర ప్రారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



