Friday, May 23, 2025
Homeట్రెండింగ్ న్యూస్కేసీఆర్‌కు క‌విత సంచ‌ల‌న లేఖ‌..!

కేసీఆర్‌కు క‌విత సంచ‌ల‌న లేఖ‌..!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారంటూ ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ వైరల్ అవుతోంది. ఈ లేఖ మొత్తం 6 పేజీలు ఉంది. పాజిటివ్ నెగిటివ్ ఫీడ్ బ్యాక్ అంటూ ప‌లు విష‌యాల‌ను ఇందులో ప్ర‌స్తావించారు. లేఖ‌లో ముఖ్యంగా కవిత వ‌రంగ‌ల్ బ‌హిరంగ స‌భ విష‌యంలో అసంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్టు క‌నిపిస్తోంది. వరంగల్ సభలో కేసీఆర్ స్టేజ్ పైకి వచ్చే ముందు సీనియర్ నేతలు మాట్లాడి ఉండాల్సిందని లేఖ‌లో పేర్కొన్నారు. అంతే కాకుండా 2001 నుంచి మన పార్టీలో ఉన్న వారు ప్రసంగిస్తే బాగుండేదని అభిప్రాయ‌ప‌డ్డారు.

పార్టీ నేత‌ల‌కు యాక్సెస్ ఇవ్వ‌డం లేదంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ధూంధాం కార్యకర్తలను ఆకట్టుకోవడంలో మనం విఫలం అయ్యామ‌ని, బీజేపీపై ఇంకా బలంగా మాట్లాడితే బాగుండేదని క‌విత అభిప్రాయ‌ప‌డ్డారు. భవిష్యత్తులో బీజేపీతో కేసీఆర్ పొత్తు పెట్టుకుంటారని చాలా మంది ప్రచారం చేస్తున్నారని, తాను కూడా బీజేపీ వల్ల చాలా ఇబ్బంది పడ్డానని పేర్కొన్నారు. బీజేపీని ఇంకొంచెం టార్గెట్ చేయాల్సిందేమో డాడీ అని పేర్కొన్నారు.

అంతే కాకుండా మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం పోటీ చేయకుండా బీజేపీకి మద్దతు ఇచ్చామన్న మెసేజ్ కాంగ్రెస్ బలంగా తీసుకెళ్లిందని అన్నారు. ఈ పొలిటికల్ సినారియోను అడ్రెస్ చేయడానికి స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ గైడ్ లైన్స్ ఇస్తారని అంతా భావించారని, ఇప్పటికైనా 1-2 ప్లీనరీ పెట్టాలని సూచించారు. అంతే కాకుండా ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణపై మాట్లాడ‌లేద‌ని, వ‌క్ఫ్ చ‌ట్టం గురించి మాట్లాడ‌లేద‌ని పేర్కొన్నారు. లోక‌ల్ బాడీ ఎన్నిక‌ల‌ను పాత ఇంచార్జ్‌లకు అప్పజెప్పడం వ‌ల్ల‌ వాళ్లు తెలంగాణ ఉద్యమకారులకు తగిన ప్రాధాన్యత ఇవ్వడంలేద‌ని ఫీడ్ బ్యాక్ అందిందన్నారు. ఓవ‌రాల్‌గా వ‌రంగ‌ల్ స‌భ‌లో ఇంకొంచెం పంచ్ ఆశించారని కానీ ఫైనల్‌గా లీడర్స్ క్యాడర్ సంతృప్తి చెందార‌ని లేఖ‌లో పేర్కొన్నారు.

లేఖ‌లో లేవ‌నెత్తిన ప్ర‌శ్న‌లు
సిల్వర్ జూబ్లీ సభలో బిజెపి ని టార్గెట్ ఎందుకు చేయలేదు?
వక్ఫ్ బిల్లు పై ఎందుకు మాట్లాడలేదు?
BC వర్గీకరణ పై ఎందుకు మాట్లాడలేదు?
MLC ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు?
బి ఫార్మ్స్ మీరు స్వయంగా ఎందుకు ఇవ్వడం లేదు?
క్యాడర్ తో మీరు ఎందుకు మాట్లాడటం లేదు?
కాంగ్రెస్ కు పోటీ మన నేతలే బిజెపి అని చెబుతున్నారు మీకు తెలుసా?
నేను అరెస్ట్ అయ్యాకనే పార్టీ పరువు పోయిందని మీరు నమ్ముతున్నారా?
ఉద్యమ నేతలను ఎందుకు పట్టించుకోవడం లేదు?
అందరూ అనుకుంటున్నట్లుగా BRS BJP పొత్తు వుంటుందా?
కొందరితోనే అందుబాటులో వుంటున్నారు ఎందుకు?
హరీష్ రావు కట్అవుట్ వరంగల్ సభలో ఎందుకు పెట్టలేదు?
వరంగల్ సభలో ఉర్దూలో ఎందుకు మాట్లాడలేదు?
BJP అంటే భయపడుతున్నారా?
మీతో మాట్లాడే అవకాశం లేదని చాలామంది మన నేతలే బాధపడుతున్న విషయం మీ వరకు వచ్చిందా?
నచ్చినవి
వరంగల్ సభ క్యాడర్ కు భరోసా ఇచ్చింది
మావోయిస్టు లపై జరుగుతున్న కగార్ ఆపరేషన్ ఖండించారు సంతోషం
రేవంత్ రెడ్డి తిడుతున్నా మీరు అతన్ని ఒక్కమాట అనలేదు, హుందాగా ఉన్నారు బావుంది
మే 2న కవిత రాసిన ఆరు పేజీల లేఖ ఆమె అమెరికా వెళ్లిన తరువాత ఇవాళ లీక్ అయ్యింది! కుటుంబంలో ఆధిపత్య పోరు నడుస్తున్నట్లు కనిపిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -