Monday, January 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడి జన్మదిన వేడుకలు

బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడి జన్మదిన వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయం వద్ద బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గంగా ప్రసాద్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తల సమక్షంలో గంగా ప్రసాద్ తో కేక్ కట్ చేయించి జన్మదిన వేడుకను నిర్వహించారు.ఈ సందర్భంగా గంగా ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ పార్టీలో ఇంకా ఉన్నత పదవులు అధిరోహించి ఆయురారోగ్యాలతో ఉండాలని నాయకులు ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శివన్నోళ్ల శివ కుమార్, జిల్లా కార్యదర్శి తక్కూరి దేవేందర్, కమ్మర్ పల్లి,  మోర్తాడ్ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుంకేట రవి, ముత్యాల రాములు, జిల్లా కిసాన్ ఖేత్ ఉపాధ్యక్షులు పడిగెల ప్రవీణ్,  హాసాకొత్తూర్ సర్పంచ్ నలిమెల రేవతి గంగాధర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సల్లూరి గణేష్ గౌడ్, నిమ్మ ప్రసాద్, బుచ్చి మల్లయ్య, అవారీ సత్యం, పాషా, మండల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -