- Advertisement -
నవతెలంగాణ – కాటారం
కాటారం మండలం చిదినేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని బొప్పారం వాగు నుండి మిట్ట మధ్యాహ్నం అక్రమంగా ఇసుకను తరలిస్తూ దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. సామాన్యుల అవసరాలను ఆసరాగా చేసుకుని వాగులను తోడి మండల కేంద్రానికి ట్రాక్టర్ల ద్వారా తరిలించి అధిక రేట్లకు అమ్ముకుంటున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో ఇసుక అక్రమ రవాణా రాజ్యమేలుతుంది. నిత్యం ఇసుక ఇంతలా దోపిడికీ గురువుతున్నా అధికారులు నిమ్మకునీరెత్తనట్టు వ్యవహరిస్తున్నారంటే ముడుపులు ఎంతలా పుచ్చుకున్నారో అర్థం అవుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
- Advertisement -



