నవతెలంగాణ – దర్పల్లి
క్రీడలవల్ల మానసిక ఉల్లాసంతోపాటు, శరీర దృఢత్వం బాగుంటుందని గ్రామ సర్పంచ్ చెలిమేల శ్రీనివాస్ అన్నారు. ఆదివారం అయన మండల కేంద్రములోని యువకులు నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమములో ముఖ్య అతిధిగా పాల్గొని క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉత్తేజంతో పాటు ఒకరిమధ్య ఒకరికి స్నేహాభావం పెరుగుతుందన్నారు. క్రీడలను క్రీడలుగా చూస్తాతూ అందరు కలిసి మెలసి పోటిల్లో పాల్గొనాలని అయన సూచించారు. ఈ కార్యక్రమములో విశిష్ట అతిధిగా ఆర్మూర్ చిన్న బాలరాజ్, ఊపసర్పంచ్ ఎజ్జా శ్రీకాంత్, వార్డు సభ్యులు చెలిమేల అజయ్, నిమ్మల వినయ్, సిహెచ్ గంగాధర్, టోర్నమెంట్ నిర్వాహకులు, అయ్యాగ్రమాలు యువత పాల్గొన్నారు.
క్రీడలతో మానసిక ఉల్లాసం: సర్పంచ్ చెలిమెల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



