- Advertisement -
నవతెలంగాణ – ఆలేరు రూరల్
టంగుటూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ కార్యవర్గ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు హాజరై నూతన గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షుడిగా బండి శ్రీనివాస్ ని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. అలాగే ఉపాధ్యక్షుడిగా కళ్లేపు నరేష్,ప్రధాన కార్యదర్శిగా జూకంటి గణేష్, కార్యదర్శిగా ఎలగందుల వెంకటేశ్,సహాయ కార్యదర్శిగా అవునూరి శ్రీనాథ్,కోశాధికారిగా జాలపు కొండల్ రెడ్డిలను ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు.నూతనంగా ఎన్నికైన కమిటీ గ్రామంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సమావేశంలో నిర్ణయించారు.
- Advertisement -



