నెల్లికుదురు గ్రామ సర్పంచ్ పులి వెంకన్న
నవతెలంగాణ – నెల్లికుదురు
మండల కేంద్రంలోని ఎండి షకీల్ మృతిచెందగా ఆ కుటుంబాన్ని సందర్శించి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొంత ఆర్థిక సహాయాన్ని ఆదివారము అందించినట్లు ఆ గ్రామ సర్పంచ్ పులి వెంకన్న తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎండి షకిల్ మృతి చెందడం బాధాకరమని అన్నారు. ఆ కుటుంబాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపి ఆ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు కలిసి ఆర్థిక సహాయాన్ని అందించామని అన్నారు. మృతి చెందిన కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. మృతి చెందిన కుటుంబానికి ప్రతి ఒక్కరు అండగా నిలవాలని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మంచాల వెంకన్న నాయకులు కుమ్మరి కుంట్ల మౌనేందర్, వెన్నం క్రాంతి రెడ్డి, కొంపల్లి శ్రీశైలం, ఐతా ఉపేందర్, నరసయ్య,హెచ్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆర్థికసాయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



