నవతెలంగాణ-హైదరాబాద్ : పాత పింఛను పథకం పునరుద్ధరణ కోసం అలుపెరుగని పోరాటం చేస్తామని.. పాలకులు ఎవరైనా భాగస్వామ్య పింఛను పథకం రద్దు చేసి తీరాల్సిందేనని
ఆలిండియా న్యూ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్( ఏ ఐ ఎన్ పి ఎస్ ఈ ఎఫ్)జాతీయ ప్రధాన కార్యదర్శి మాచన రఘునందన్ స్పష్టం చేశారు. బుధవారం నాడు ఆయన అమీర్ పేట లో.. మాట్లాడుతూ..పాత పింఛను పథకం పునరుద్ధరణ,న్యూ పెన్షన్ స్కీమ్ రద్దు విషయం లో అటు కేంద్రం,ఇటు రాష్ట్రాలు అనుసరిస్తున్న ధోరణి పై చర్చించేందుకు గాను వివిధ రాష్ట్రాల అధ్యక్షుల తో..ఆదివారం నాడు జూమ్ సమావేశం జరిగిందని..ఈ సందర్భంగా దక్షిణ భారత దేశం ప్రతినిధి గా.. తెలంగాణ నుంచి హాజరైన తనను ఏ ఐ ఎన్ పి ఎస్ ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి గా నియమిస్తున్నట్టు..జాతీయ అధ్యక్షులు మంజీత్ సింగ్ స్పష్టం చేసినట్టు రఘునందన్ వివరించారు. దేశ వ్యాప్తంగా కోటి మంది కి పైగా ఉద్యోగులు కొత్త పెన్షన్ పథకం లో ఉన్నారని రఘునందన్ స్పష్టం చేశారు. 2004 సెప్టెంబర్ 1 నుంచి ఉమ్మడి అంధ్ర ప్రదేశ్ లో భాగస్వామ్య పింఛను పథకం అమలు ప్రారంభం అయ్యిందని,ఉద్యోగం అంటేనే ఒక సామాజిక భద్రత కాగా.. సి పి ఎస్ లో ఉన్న ఉద్యోగి కి అర్ధిక భద్రత తో పాటు సామాజిక భద్రత కూడా ఉండదని రఘునందన్ అవేదన వ్యక్తం చేశారు.ప్రమాదవశాత్తు ఎవరైనా సి పి ఎస్ ఉద్యోగి కి అవాంఛనీయ సంఘటన కు గురైతే కనీసం లక్ష రూపాయలు కూడా వారి ఖాతా లో ఉండవని, అటువంటపుడు పెన్షన్ రాని ప్రభుత్వ ఉద్యోగం కన్నా ప్రైవేటు ఉద్యోగమే మిన్న అన్న భావన ను కాంట్రి బ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు వ్యక్తం చేస్తున్నారని రఘునందన్ అభిప్రాయపడ్డారు. ఈ నెల 11 న కొత్త ఢిల్లీ లో కార్యక్రమం ఉందని”మాచన” తెలిపారు




