Monday, January 12, 2026
E-PAPER
Homeజాతీయంఇన్‌స్టాగ్రామ్‌ డేటా లీక్‌

ఇన్‌స్టాగ్రామ్‌ డేటా లీక్‌

- Advertisement -

17.5 మిలియన్‌ యూజర్ల ఖాతాలు బహిర్గతం : సైబర్‌ సెక్యూరిటీ సంస్థ మాల్వేర్‌ బైట్స్‌ వెల్లడి
అసలేంటి ఈ డేటా లీక్‌? ఏం జరిగింది?

న్యూఢిల్లీ: ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం లీక్‌ అయ్యిందనే వార్త కలకలం రేపుతోంది. భారీ డేటా తస్కరించినట్టు వార్తలు వైరల్‌ అవుతున్నాయి. గత వారం.. అనేక మంది ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్స్‌ పాస్‌వర్డ్‌ రీసెట్‌ ఇమెయిల్స్‌ అందుకున్నట్టు రిపోర్ట్‌ చేశారు.దీంతో ఇది డేటా ఉల్లంఘనకు దారితీస్తుందనే ఆందోళనలను రేకెత్తించింది. శుక్రవారం.. ప్రపంచవ్యాప్తంగా 17.5 మిలియన్ల ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్ల డేటా లీక్‌ అయ్యిందని సైబర్‌ సెక్యూరిటీ సంస్థ మాల్వేర్‌ బైట్స్‌ పేర్కొంది. ” అకౌంట్స్‌కు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని సైబర్‌ నేరస్థులు దొంగిలించారు, వాటిలో యూజర్‌ పేర్లు, చిరునామాలు, ఫోన్‌ నంబర్లు, ఇమెయిల్‌ అడ్రస్‌లతో పాటు మరిన్ని వివరాలు ఉన్నాయి” అని మాల్వేర్‌బైట్స్‌ పేర్కొంది. ”ఈ డేటా డార్క్‌ వెబ్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంది , సైబర్‌ నేరస్థులు దుర్వినియోగం చేయవచ్చు.”అని తెలిపింది. ఇన్‌స్టాగ్రామ యూజర్ల డేటా లీక్‌ గురించిన వార్తలు వస్తున్న నేపథ్యంలో నెటిజెన్లు సోషల్‌ మీడియా వేదికగా రియాక్ట్‌ అవుతున్నారు.

అసలేంటి ఈ డేటా లీక్‌? ఏం జరిగింది?
1.75 కోట్ల ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లకు సంబంచిన పర్సనల్‌ డేటా డార్క్‌ వెబ్‌ ఫోరమ్‌లలో అమ్మకానికి ఉందనే వార్తలు వచ్చాయి. ఇన్‌స్టాగ్రామ్‌ చరిత్రలోనే అతిపెద్ద డేటాలీక్‌గా భావిస్తున్నారు. ఈ డేటా సేకరణ లేదా లీక్‌ హ్యాకింగ్‌ ద్వారా కాకుండా, డేటా స్క్రాపింగ్‌ లేదా ఏపీఐ మిస్‌ యూజ్‌ లేదా థర్డ్‌ పార్టీ టూల్స్‌ ద్వారా సేకరించిన సమాచారంగా చెబుతున్నారు. లీక్‌ అయిన డేటాబేస్‌లో ముఖ్యంగా వ్యక్తిగత సమాచారం ఎక్కువగా పేర్కొంది. ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్ల పూర్తి పేర్లు, యూజర్‌నేమ్స్‌, వెరిఫైడ్‌ ఇమెయిల్‌ చిరునామాలు,ఫోన్‌ నంబర్లు,యూజర్‌ ఐడీలు,దేశం, పార్షియల్‌ లొకేషన్‌ డేటా వంటి వివరాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరి ఇన్‌స్టా అకౌంట్స్‌ సేఫ్‌గా ఉన్నాయని, ఈ సందర్భంగా ఏర్పడిన గందరగోళానికి క్షమాపణలు తెలియజేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -