- Advertisement -
ప్రధాన కార్యదర్శిగా తెల్కలపల్లి పెంటయ్య ఎన్నిక
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
టీపీయూఎస్ రాష్ట్ర అధ్యక్షులుగా వోడ్నాల రాజశేఖర్ (జగిత్యాల), రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తెల్కలపల్లి పెంటయ్య (యాదాద్రి)లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్ అబిడ్స్‌లోని స్టాన్లీ ఇంజనీరింగ్ కళాశాలలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) కార్యనిర్వాహక సమావేశంలో 2025 -28 కాలానికి ఎన్నిక నిర్వహించారు. సమావేశంలో నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాలనీ, పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ, డీఏలను వెంటనే ప్రకటించాలని తదితర తీర్మానాలను ఆమోదించారు. ఈ సమావేశంలో ఏబీఆర్‌ఎస్‌యం జాతీయ సంఘటన మంత్రి మహేంద్ర కపూర్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



