- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రి నుంచి ఆదివారం డిశ్చార్జ్ అయ్యారు. ఛాతీలో ఇన్ఫెక్షన్ కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడటంతో వారం రోజుల క్రితం ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. సోనియా ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, తదుపరి చికిత్సను వైద్యులు ఇంటివద్దే కొనసాగించాలని సూచించారని తెలిపాయి.
- Advertisement -



