నవతెలంగాణ-హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి పూర్తిస్థాయి కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. చిరంజీవికి జోడీగా లేడీ సూపర్‌స్టార్ నయనతార నటించగా, వెంకటేష్ ప్రత్యేక కేమియో సినిమాపై ఉన్న క్రేజ్‌ను మరింత పెంచింది. భారీ బడ్జెట్‌తో సాహు గారపాటి, సుస్మిత ఈ చిత్రాన్ని నిర్మించగా, సెన్సార్ నుంచి ‘U/A’ సర్టిఫికేట్ పొందింది. ఆదివారం రాత్రి జరిగిన ప్రీమియర్ షోలతోనే సినిమాకు పాజిటివ్ టాక్ మొదలైంది. ముఖ్యంగా చిరంజీవి వింటేజ్ ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ అభిమానులను ఫుల్‌గా అలరిస్తున్నాయని టాక్ వినిపిస్తోంది. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేస్తుండగా, వెంకటేష్ కేమియో సీన్స్ థియేటర్లలో విజిల్స్ వేయిస్తున్నాయని రివ్యూలు చెబుతున్నాయి. నయనతార పాత్రకు సరైన వెయిటేజ్ ఇవ్వడం కూడా సినిమాకు ప్లస్ పాయింట్‌గా మారింది. మొత్తంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు మెగా ఫ్యాన్స్‌ను టార్గెట్ చేసిన కంటెంట్‌గా ఈ సినిమా నిలిచిందని ప్రీమియర్ టాక్ స్పష్టం చేస్తోంది.
పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న మన శంకర వరప్రసాద్ గారు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



