నవతెలంగాణ – నూతనకల్
ఇటీవల మండల పరిధిలోని మా చనపల్లి గ్రామానికి చెందిన వీరబోయిన అనసూర్య అనారోగ్యంతో మృతి చెందింది. ఆదివారం తుంగతుర్తి శాసనసభ సభ్యులు మందుల సామెల్ మృతురాలి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులకు రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జెన్నారెడ్డి, వివేక్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు దరిపెల్లి వీరన్న, గుగులోతు కృష్ణ నాయక్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పసుల అశోక్ యాదవ్, మండల కాంగ్రెస్ నాయకులు కట్ట మల్లారెడ్డి, వెలిమినేటి కృష్ణ ప్రశాంత్, పాల్వాయి నాగరాజు, కాంగ్రెస్ పార్టీ మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ బోల్క సైదులు, కాంగ్రెస్ నాయకులు గుగులోతు రవి, ఉప్పల పాపయ్య, సురుగు రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



